ఐపీఎల్ లో అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్ళున్నా.. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లను మాత్రం ఈ లీగ్ కి దూరం పెట్టేసింది బీసీసీఐ. ఇక అప్పటినుంచి ఐపీఎల్ మీద పడి ఏడుస్తున్నారు.ఈ క్రమంలో వ్యూయర్‌షిప్ ను తగ్గించేందుకు ఒక కొత్త ప్లాన్ వేసింది.
షాహీన్ అఫ్రిదీ.. పాకిస్థాన్ బౌలింగ్ తురుపు ముక్కగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పీఎస్ఎల్ లో లాహోర్ ఖలందర్ జట్టుకు సారథిగా ఉండి టీమ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో పెషావర్ జట్టుపై ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 8వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ లో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకుంటున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు టోర్నీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యర్థి జట్టులో స్టార్ బ్యాటర్లను లక్ష్యంగా చేసుకుని బౌలర్లు నోటికి పనిచెబుతున్నారు.
ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ బెస్ట్ అని పాక్ మాజీ క్రికెటర్లు చాన్స్ దొరికినప్పుడల్లా అంటుంటారు. తమ లీగ్ ముందు ఐపీఎల్ కూడా ఎందుకూ పనికిరాదని వాగుతుంటారు. అయితే బీసీసీఐ నిర్వహించిన డబ్ల్యూపీఎల్ వేలంతో పీఎస్‌ఎల్ పరువు మంటగలిసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్-2023 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వాహకులు అర్ధాంతరంగా ఆపేశారు. మ్యాచ్ జరుగుతున్న క్వెట్టా నగరంలో బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి కొందరు రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పటించారు. దీంతో నిర్వాహకులు ఆటను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, క్వెట్టా నగరంలో ఆదివారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్వెట్టాలోని ఎఫ్‌సీ ముస్సా చెక్ పాయింట్ వద్ద […]