Asia Cup 2022 Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో లంక చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 23 పరుగుల తేడాతో ఓడింది. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా సహనం కోల్పోయాడు. జవుర్నలిస్టు ఫోన్ లాక్కోవడమే కాకుండా.. ‘పాక్ ఓడిపోతే.. ఇండియాకు సంతోషమేగా..’ అంటూ అక్కసు వెళ్లగక్కాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆసియా కప్ ఫైనల్ చూడటానికి దుబాయ్ వచ్చిన రమీజ్ రాజా.. పాక్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఈ తరుణంలో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ ముగిశాక బయిటకు వచ్చే సమయంలో విలేకరుల నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. కానీ, అప్పటికే పాక్ ఓటమితో డిసపాయింట్ గా ఉన్న రమీజ్ రాజా వారికి సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకోవాలని చూశాడు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు.. ‘పాకిస్తాన్ లో ప్రజలు ఈ ఓటమితో బాధపడుతున్నారా..?’ అని ప్రశ్నించాడు. దానికి రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘నువ్వు తప్పకుండా ఇండియా నుంచే అయి ఉంటావ్. మేం మ్యాచ్ ఓడిపోతే నువ్వు హ్యాప్పీయేనా..?’ అని సదరు జర్నలిస్టుతో అన్నాడు.
How can you try to snatch the phone of our reporter? Why can’t you accept the fact that Pakistanis are extremely disappointed with your leadership. Peak frustration Ramiz Raja @iramizraja 👎#SportsYaari #Pak @rohitjuglan pic.twitter.com/BCQzXZonhV
— Sushant Mehta (@SushantNMehta) September 11, 2022
అతని మాట తీరు చూస్తుంటే.. ‘పాక్ ఓడిపోతే.. ఇండియాకు సంతోషమేగా..’ అన్నట్లుగా ఉంది. ]ఆపై తననెవరూ ప్రశ్నించకుండా అక్కడ్నుంచి జారుకున్నాడు. వెళ్తున్న క్రమంలో జర్నలిస్టు ఫోనును అతడి చేతిలోనే పెడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. రమీజ్ రాజా చేసిన ఈ పనిపై నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ముందు సహనంగా ఉండటం నేర్చుకోవాలని సలహాలిస్తున్నారు.
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, అతడికి వసిందు హసరంగ (36), చమిక కరుణరత్నె (14 నాటౌట్) చక్కటి సహకారం అందించారు. ఒక దశలో లంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాజపక్స తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (55) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ఇఫ్తిఖార్ (32), రవుఫ్ (13) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ 4, హసరంగ మూడు వికెట్లు పడగొట్టారు. రమీజ్ రాజా తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Absolute SCENES from the dressing room of tonight’s CHAMPIONS! 🤩🏆
The Sri Lankan 🇱🇰 players are in a mood to celebrate and we’re all for it! 🥳#SLvPAK #ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/Bc5HINrkN0— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022