స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తమ అభిమాన జట్టు ఆటగాడు ఫోరో.. సిక్సో కొడితే మనమే కొట్టినంతగా సంబరపడిపోతాం. అ దే అవుటైతే నిరాశగా ఉండిపోతాం. అంతేకదా అందరు అభిమానులు చేసేది! అని అనుకోవచ్చు. కానీ మనకు ఏ మాత్రం సంబంధంలేని మ్యాచ్ కు వెళ్లి.. మన శత్రు దేశానికి సంబంధించిన ఆటగాడు అవుటైతే.. అది మనకూ ఆనందమే. ఈక్రమంలోనే ఓ పాక్ అభిమానికి భారత అభిమాని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సిక్స్ కొడితే కాలర్ ఎగరేసిన పాక్ అభిమానికి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు ఓ భారత అభిమాని. తాజాగా ఇలాంటి సంఘటనే ఆసియా కప్ ఫైనల్లో జరిగింది. అండర్ కవర్ ఏజెంట్ లా మారి మరీ.. మ్యాచ్ ను చూశాడు ఓ అభిమాని. ఈ వీడియోని భారత్ ఆర్మీ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. మ్యాచ్ పోటా పోటీగా సాగనప్పటికీ, అభిమానులు మాత్రం పోటా పోటీగా అరుపులు.. కేకలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తీసిన ఓ వీడియో ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే? పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సిక్స్ కొట్టాడు. దాంతో ఓ పాక్ అభిమాని శ్రీలంక జెర్సీ ధరించిన అభిమాని వద్దకు వచ్చి కాస్త ఓవర్ గా బిహేవ్ చేస్తాడు. చూశావ్ గా మావాడు ఎలా సిక్స్ కొట్టాడో అన్నట్లు వ్యవహరిస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత వెంటనే రిజ్వాన్ ను హసరంగా అవుట్ చేస్తాడు. దాంతో శ్రీలంక జెర్సీ ధరించిన అభిమాని ఒక్క సారిగా జెర్సీని విప్పుతాడు. అతడు లోపల భారత జెర్సీని ధరించి ఉండటం విశేషం.
అంటే ఈ పాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా! ఆ అభిమాని భారత అభిమాని అని. రిజ్వాన్ అవుట్ కాగానే అతడి ఆనందానికి అవధుల్లేవ్.. శ్రీలంక జెర్సీని విప్పి గాల్లోకి గిర గిర తిప్పుతూ పాక్ అభిమానికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ఇక అతడు లంక జెర్సీ ధరించడానికి కారణం ఏంటా అని ఆరా తీయగా.. అతడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు భారత జెర్సీ ధరించాడు. దాంతో సెక్యూరిటీ అతడిని ఆపి నువ్వు వేసుకొస్తే పాక్, లంక జెర్సీనే ధరించి స్టేడియానికి రావాలి అని చెప్పడంతో అతడు లంక జెర్సీని ధరించాల్సి వచ్చింది. ఈ వీడియో ని పోస్ట్ చేసిన భారత ఆర్మీ స్పందిస్తూ..”ఇండియన్ ఆర్మీ అయినా.. ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అయినా.. పాకిస్థాన్ కు ఎప్పుడూ షాకింగ్ ట్రిట్ మెంటే ఇస్తారు” అంటూ రాసుకొచ్చింది.
ఈ విషయంపై ఐసీసీకి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన మరో నెటిజన్ ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్ నువ్వు అంటూ సరదాగా స్పందించారు. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు అంతా ఇండియన్ అభిమానులతో పెట్టుకుంటే మామ్ములుగుండదు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నగాక మెున్న జరిగిన ఆఫ్గాన్-పాక్ మ్యాచ్ లో స్టేడియంలోనే అభిమానులు కొట్టుకున్న వీడియోని మనం చూశాం. అభిమానం ఉండాలిగానీ అది శృతి మించరాదు అన్నది జగమెరిగిన సత్యం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Undercover agent 🤣🤣🤣🤣pic.twitter.com/lpM9XtfY7S
— Sidha_memer (@Sidha_memer) September 12, 2022
😡 SHOCKING TREATMENT as The Bharat Army and other Indian Cricket Fans told they can not enter the stadium wearing ‘India jerseys’! #BharatArmy #PAKvSL pic.twitter.com/5zORYZBcOy
— The Bharat Army (@thebharatarmy) September 11, 2022