శ్రీలంక జట్టు ఆసియాకప్ గెలవడం నిజంగా చాలామంది షాకిచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీలంక అంటే జయసూర్య, జయవర్ధనే, సంగక్కర, దిల్షాన్ లాంటి అద్భుతమైన క్రికెటర్స్ గుర్తొచ్చేవారు. వాళ్ల తరం వెళ్లిపోయిన తర్వాత చెప్పుకోదగ్గ లంక జట్టు పూర్తిగా మారిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ పేరు సంపాదించలేకపోయారు. ప్రతి అంతర్జాతీయ టోర్నీలోనూ ఘోరమైన ప్రదర్శన ఇస్తూ వచ్చింది. అలాంటి లంక జట్టు.. ఆసియాకప్ గెలవడం, దాని వెనక ధోనీ పాత్ర ఉందనడం చాలామందికి ఆసక్తి కలిగించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలో ఈసారి ఆసియాకప్ మొదలైనప్పుడు శ్రీలంక జట్టుపై ఎవరికీ ఒక్క శాతం కూడా నమ్మకం లేదు. దానికి తోడు ప్రారంభ మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ పై ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. ఇక టైటిల్ కోసం పాకిస్థాన్ జట్టుతో జరిగిన ఈ పోరులో టాస్ ఓడినప్పటికీ లంకే గెలిచేసింది. సాధారణంగా దుబాయిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవడం కష్టం. కానీ దాన్ని బ్రేక్ చేసిన లంక జట్టు ఆరోసారి ఆసియాకప్ ని ముద్దాడింది. అంతా బానే ఉంది కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
లంక కప్పు గెలవడంలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ పాత్ర పరోక్షంగా ఉందట. ఆ విషయాన్ని స్వయంగా లంక కెప్టెన్ శనక చెప్పాడు. ‘2021 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసినా సరే కప్ గెలిచింది. మా జట్టులో కొందరు కుర్రాళ్లకు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. దానికి తోడు మా జట్టు కూడా బాగా ఫెర్ఫార్మ్ చేసింది. ఫైనల్లో మేం వందశాతం కష్టపడ్డాం. దానికి ప్రతిఫలమే ఈ విజయం’ అని శనక అన్నాడు. అలా ధోనీ సీఎస్కే కప్ గెలవడం శ్రీలంక జట్టు స్ఫూర్తినిచ్చిందనమాట. మరి శనక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: టీంఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు!