ప్రస్తుతం ఉన్న వ్యాపార ప్రపంచంలో సినీతారలు, క్రీడాకారులు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా ఉంటున్నారు. ఆ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లు గడిస్తున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని ఇబ్బందులను సైతం ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా టీంఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టు నోటిసులు పంపింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ధోనీ.. మైదానంలో ఎంత కూల్ గా ఉంటాడో.. బయటా అంతే కూల్ గా కనిపిస్తాడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే తాజాగా ఓ వివాదంలో అతనికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ఆమ్రపాలి గ్రూప్ కేసులో ధోనీకి ఈ నోటిసులు వచ్చినట్లు సమాచారం. గతంలో ఆమ్రపాలి కన్ స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ ప్రచార కర్తగా పనిచేశాడు. ఆ సమయంలో తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని కంపెనీ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్ పై మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రారంభించింది. The Supreme Court of India on Monday issued notice to former India captain MS Dhoni, staying the arbitration proceedings initiated by the Delhi High Court against the Amrapali group on his pleahttps://t.co/9nWLm3dIiL — WION (@WIONews) July 26, 2022 తాజాగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ధోనీకి షాక్ తగిలినట్లు అయ్యింది. ధోనీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. ఆమ్రపాలి కంపెనీ తనకు రూ.40 కోట్లు ఎగ్గొట్టిందని. ఇదిలా ఉంటే మరోవైపు కంపెనీ మాత్రం ధోనీనే మాకు రూ.42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటిసులు రావడం అనేది ధోనీకి పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. The Supreme Court stayed the arbitral proceedings initiated by former India captain #MSDhoni against the Amrapali group of companies, now a defunct real estate firm for which the cricketer was the brand ambassador, over some financial dispute pic.twitter.com/1BMtyRQOr8 — Mirror Now (@MirrorNow) July 26, 2022 ఇదీ చదవండి: వీడియో: భూ వివాదంలో గొడవ.. కత్తితో పొడిచి దారుణం! ఇదీ చదవండి: Sachin vs Olonga: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!