SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Afghanistan Beat Bangladesh With 7 Wickets

Asia Cup 2022: బంగ్లాదేశ్‌నూ చిత్తు చేసిన అఫ్ఘనిస్థాన్‌! రషీద్‌ ఖాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 31 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: బంగ్లాదేశ్‌నూ చిత్తు చేసిన అఫ్ఘనిస్థాన్‌! రషీద్‌ ఖాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లు ఆ జట్టులో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురున్నారు. అలాగే ప్రస్తుత టీ20 క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్లు, ఫినిషర్‌ ఉన్న టీమ్‌. అఫ్ఘనిస్థాన్‌ పేరుకు చిన్నటీమే అయినా.. జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కోదవలేదు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలుత బౌలింగ్‌ బలంతో ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టి.. తర్వాత తమ పవర్‌ హిట్టింగ్‌ను రుచిచూపించి ఆసియా కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది అఫ్ఘనిస్థాన్‌. ఆ జట్టు టాప్‌ క్లాస్‌ బౌలర్లు రషీద్‌ఖాన్‌, ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడేసి వికెట్లతో బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఆఫ్ఘాన్‌ బ్యాటర్‌ నజీబుల్లా జద్రాన్‌ చెలరేగిపోయాడు. ఆరు భారీ సిక్సులు మ్యాచ్‌ను మలుపుతిప్పి అఫ్ఘానిస్థాన్‌ చేతుల్లో పెట్టాడు. మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. లోయరార్డర్ బ్యాటర్ మోసాద్దేక్ హోస్సెన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 48(నాటౌట్‌) పరుగులతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హోస్సెన్‌కు సపోర్ట్‌గా మాజీ కెప్టెన్‌ మహముదుల్లా(25) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అఫ్ఘనిస్థాన్‌ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. లక్ష్య చేధరకు దిగిన అఫ్ఘానిస్థాన్‌.. తొలుత తడబడినా.. చివరికి నిలబడింది. జద్రాన్ పోరాటంతో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 131 పరుగులు చేసి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

Rashid Khan

బంగ్లా స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో అఫ్ఘానిస్థాన్‌ ఓడిపోతుందేమో అనిపించింది. కానీ.. 24 బంతుల్లో 43 పరుగులు అవసరమైన టైమ్‌లో నజీబుల్లా జద్రాన్‌ చెలరేగిపోయాడు. ముస్తాఫిజుర్ వేసిన 17 ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సైఫుద్దిన్ వేసిన 18వ ఓవర్‌లో ఇబ్రహీమ్ రెండు బౌండరీలు బాదగా నజీబుల్లా రెండు భారీ సిక్సర్లతో విజయం ఖాయం చేశాడు. 19వ ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేవలం 17 బంతులు ఎదుర్కొన్న నజీబుల్లా ఒక ఫోర్‌, 6 సిక్సులతో 43 పరుగులు చేసి విజయాన్ని అందించాడు.

Rashid Khan

రషీద్‌ ఖాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు..
టీ20 స్పెషలిస్ట్‌ వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. టీ20ల్లో రషీద్‌ ఖాన్‌ 115 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా 114 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీని రషీద్‌ అధిగమించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మరి బంగ్లాదేశ్‌పై అఫ్ఘనిస్థాన్‌ విజయం, రషీద్‌ ఖాన్‌ రికార్డు, నజీబుల్లా పవర్‌హిట్టింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

What a knock from Najibullah Zadran! 🔥#NajibullahZadran #AFGvBAN #AsiaCup pic.twitter.com/7trr6LPbdv

— CricTracker (@Cricketracker) August 30, 2022

A spectacular finish from Najibullah Zadran as Afghanistan make it two wins in two in #AsiaCup2022 🔥#BANvAFG | 📝 Scorecard: https://t.co/5cGrYOhU7p pic.twitter.com/NKPYC2Xp9q

— ICC (@ICC) August 30, 2022

Here’s how Asia Cup 2022 points table looks like after the Bangladesh vs Afghanistan match.#CricTracker #BANvAFG #AsiaCup2022 #NajibullahZadran pic.twitter.com/evDGldPTPK

— CricTracker (@Cricketracker) August 30, 2022

Unbelievable fight and an even better win! 💪

Super happy to contribute tonight, we keep going on!! 🇦🇫💙👊#BANvAFG #AsiaCup2022 #AsiaCup pic.twitter.com/IjxgtPsrGB

— Rashid Khan (@rashidkhan_19) August 31, 2022

Rashid Khan is in a different league in the T20 format. pic.twitter.com/KDXArhvdDo

— Johns. (@CricCrazyJohns) August 30, 2022

Rashid Khan now second leading wickettaker in T20I Internationals in just 68 matches – He is a Freak. pic.twitter.com/XMymVDhaJV

— CricketMAN2 (@ImTanujSingh) August 30, 2022

Tags :

  • Afghanistan
  • Asia Cup 2022
  • Bangladesh
  • Cricket News
  • Najibulla Zadran
  • Rashid Khan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam