ఐ..పీ..ఎల్.. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు.. క్రికెట్ ఉత్సవం. ఐపీఎల్ కు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కేవలం ఆటగానే కాదు.. యంగ్ టాలెంట్ వేటగా మారింది. ఈ లీగ్ నుంచి ఇండియన్ క్రికెట్ లోకి ఎంతో మంది యువఆటగాళ్లు వచ్చారు. అప్పటి వరకు టీ20 తరహా లీగ్ మ్యాచ్ లు అంటే ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనే జరిగేవి. కానీ 2008 నుంచి ఆ జాతర మన దేశంలో జరగడం మొదలైంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రికెట్ ఉత్సవం మొదలయ్యి ఏప్రిల్ 18 2022 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అసలు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ మెమోరీస్ ని మరొక్కసారి నెమరువేసుకుందాం.
ఇదీ చదవండి: IPLలో దినేష్ కార్తీక్ మెరుపులు! టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమా?
2008 ఏప్రిల్ 18న కోల్‌కతా Vs బెంగళూరు మ్యాచ్ జరిగింది. అసలు టీ20 మజా అంటే ఏంటో? ఎలా ఉంటుందో రుచి చూపించిన మ్యాచ్ అది. క్రికెట్ అభిమానులకు అప్పటి మ్యాచ్ విజువల్స్ ఇంకా వారి కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. కేకేఆర్ కు సౌరవ్ గంగూలీ సారథ్యం వహించగా.. బెంగళూరును ద్రవిడ్ లీడ్ చేశాడు. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ బాల్ వేసిన బౌలర్ గా బెంగళూరు టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్ నిలిచాడు. కేకేఆర్ కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఐపీఎల్ ఫస్ట్ బాల్ ను ఫేస్ చేశాడు. తొలి బంతికి లెగ్ బైగా ఒక రన్ వచ్చింది. ఫస్ట్ బాల్ పేస్ చేసిన గంగూలీనే ఫస్ట్ వికెడ్ గా వెనుదిరిగాడు. జహీర్ ఖాన్ వేసిన బంతి ఎడ్జ్ తీసుకుని కలిసి చేతిలో పడింది. ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ తీసిన బౌలర్ గా జహీర్ ఖాన్ నిలిచాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. కేకేఆర్ బ్యాటర్లను కట్టడి చేయండలో ఘోరంగా విఫలమైంది. గంగూలీతో పాటు ఓపెనింగ్ కు దిగిన మెక్కల్లమ్.. మ్యాచ్ జరిగిన 20 ఓవర్లు క్రీజులో ఉండి నాటౌట్‌గా రికార్డు సృష్టించాడు. ఒక్కొక్క బౌలర్ పై విరుచుకుపడిన మెక్కల్లమ్ మొత్తం 73 బంతుల్లో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాటిలో 13 సిక్సర్లు, 10 ఫోర్లతో చెలరేగిన తీరు ఇప్పటికీ క్రికెట్ ప్రపంచం మర్చిపోలేదు. 216.43 స్ట్రైక్ రేట్ మెక్కల్లమ్ ఒక విధ్వంసమే సృష్టించాడు. జహీర్ ఖాన్, కలిస్ వంటి బౌలర్లపై కూడా మెక్కల్లమ్ నిర్దాక్షిణ్యంగా, నిర్ధయగా విరుచుకుపడ్డాడు.
On 18th of April, 15 years ago @Bazmccullum wrote his name in the history of the IPL forever in big bold letters! A massive 158 from 73 balls for @KKRiders against @RCBTweets in the first-ever match of @IPL. Watch him relive his innings.@AgeasFederal @MPLSportsFdn @ASOS_Aditya pic.twitter.com/6o0bhby2gG
— RevSportz (@RevSportz) April 18, 2022
ఇదీ చదవండి: శివమ్ దూబే బద్ధకానికి CSK బలి! జడేజా కోపంలో అర్థముంది!
బెంగళూరు టీమ్ మొత్తం కేకేఆర్ తరఫున మెక్కల్లమ్ చేసిన స్కోర్ కూడా చేయలేక చతికిల పడిపోయింది. ప్రవీణ్ కుమార్(18*) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. ద్రావిడ్, వసీమ్ జాఫర్, కలిస్ వంటి దిగ్గజాలు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు కేకేఆర్ టీమ్ బ్యాట్‌తోనే కాకుండా.. బాల్ తోనూ చెలరేగిపోయారు. అగార్కర్ 3 వికెట్లు తీయగా.. గంగూలీ, అశోక్ డిండాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఇషాంత్ శర్మ, లక్ష్మీ శుక్లా చెరో వికెట్ తీసుకున్నారు. మొత్తం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. 15.1 ఓవర్లలోనే 82 పరుగులకు ఆలౌట్ గా ఓటమి పాలైంది. ఈ సీజన్ లోనైనా బెంగళూరు కప్ కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.