స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఖాళీ అయిన మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇటీవల ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగిలిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల్ని ఖరారు చేశారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు కేటాయించగా.. కాపు రెండు, కమ్మ రెండు, రెడ్డి రెండు, క్షత్రియ వర్గానికి ఒక స్థానాన్ని కేటాయించారు.
తాజగా ప్రకటించిన 11 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు..
గతంలో ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు.. శ్రీకాకుళంకు చెందిన పాలవలస విక్రాంత్, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా.