గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం వైసీపీలో చేరనుందా? ప్రస్తుతం ఆయన సైలెంట్ అయిపోవడం చూస్తుంటే అదే నిజమన్న ప్రచారం జరుగుతోంది.
మా ఎంపీ కనబడడం లేదంటూ ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు నియోజకవర్గ ప్రజలు పేపర్ లో ప్రకటన ఇచ్చేలా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. గెలిచినప్పటి నుంచి తమను పట్టించుకోవడమే మానేశారని గల్లా జయదేవ్ పై ఆరోపణలు వస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు జయదేవ్. విద్యావంతుడు, పార్లమెంట్ లో తమ తరపున పోరాటం చేసి న్యాయం చేస్తాడని గెలిపించామని గుంటూరు నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు బొత్తిగా ఎంపీ కనబడడమే మానేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జయదేవ్ గుంటూరు నియోజకవర్గం వైపు చూడడం గానీ, ప్రజా సమస్యలను పట్టించుకోవడం గానీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే గల్లా కుటుంబం మాత్రం మా పార్టీ అధికారంలో లేనిది ఏం చేయగలం అని అంటున్నారట. దీంతో ప్రజలు గల్లా జయదేవ్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు జయదేవ్ తీరుతో నియోజకవర్గ ప్రజలతో పాటు ఏడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. గల్లా జయదేవ్ ఇలానే ఉంటే ఓటమి తప్పదని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఈసారి గల్లా ఫ్యామిలీ గుంటూరు నుంచి పోటీ చేయడం లేదని, అందుకే ప్రజలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈసారి రాజకీయాల నుంచి తప్పుకుని.. మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దించుతారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే గల్లా జయదేవ్ సైలెంట్ అయిపోయారని, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం మానేశారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.