ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పార్టీకి దూరం అయ్యారు. మరి కొందరు యాక్టీవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. రెండో క్లాస్ నేతలే దర్శనం ఇస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే హీరోలమంటూ చెలామణి అయిన ముఖ్యనేతలేవరు ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీ ఓడిపోగానే ముఖం చాటేయడంతో.. నేతల కొరతతో టీడీపీ సతమతమవుతోంది. […]
భూఆక్రమణ ఆరోపణలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కేసు నమోదైంది. కోర్టు డైరెక్షన్‌తో కేసు నమోదు చేశారు చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీసులు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్, ఆయన తండ్రి […]