అప్పటి వరకూ గడ్డం, మీసంతో ఉన్న మగాళ్లని సడన్ గా క్లీన్ షేవ్ లో చూస్తే మనోడేనా అని అనుమానం వస్తుంది. ఇక గుండు కొట్టించుకుంటే ఈడు మనోడు కాదురా, ఎవరో దారిన పోయే దానయ్య అని అనుకుంటాం. ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపించే వ్యక్తి కొత్త లుక్ లో కనిపిస్తే అలానే ఉంటుంది మరి. గుబురు గడ్డం, బుర్ర మీసాలతో కనిపించే వ్యక్తి ఉన్నట్టుండి క్లీన్ షేవ్ చేస్తే గుర్తుపట్టడం కష్టమవుతుంది. సినీ, రాజకీయ రంగాల్లో కొంతమంది తమ వస్త్రధారణ, వేషధారణతో జనాల్లో బాగా నోటెడ్ అయ్యారు. సినీ నటుడు గుండు సుదర్శన్ ని చూసుకుంటే ఆయనెప్పుడూ గుండుతోనే ఉంటారు. జబర్దస్త్ కమెడియన్ ‘గడ్డం నవీన్’ కూడా ఎప్పుడూ గడ్డం తీసింది లేదు. ఇక రాజకీయ నాయకులైతే ఖద్దర్ దుస్తులు, చేనేత దుస్తులు ధరిస్తారు.
దాదాపు చాలా వరకూ నాయకులు క్లీన్ షేవ్ తోనే ఉంటారు. కొంతమంది మాత్రం గుబురు గడ్డం, బుర్ర మీసాలు కలిగి ఉంటారు. వాళ్ళు అలా ఉంటేనే జనం ఇష్టపడతారు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిత్యం బుర్ర మీసాలు, గుబురు గడ్డంతో కనిపించేవారు. పొడవాటి తెల్లని మీసం, గడ్డంతో ఉండేవారు. జుట్టు కూడా ఒత్తుగా ఉండేది. అలాంటి జగ్గారెడ్డి ఉన్నట్టుండి తల మీద వెంట్రుకలు, గడ్డం, మీసం తీసేసి దర్శనమిచ్చారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన జగ్గారెడ్డి సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. మీసం, గడ్డం లేకుండా గుండులో గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్నారు. మా జగ్గారెడ్డి సారేనా అని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telangana Congress Working President & MLA Jagga Reddy New look😎@ImJaggaReddy @INCTelangana pic.twitter.com/Ubd0C4Iw2Z
— Nageshwar Rao (@itsmeKNR) November 11, 2022