హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రభాస్ తిరుమలకు వచ్చినప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి మూవీ వస్తోందంటే చాలు ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చూసేందుకు రెడీ అయిపోతారు. వెండితెరపై ప్రభాస్ తన నటన, ఫైట్ల ద్వారా చేసే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా నిలవనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సోమవారం రాత్రి ప్రభాస్ తిరుపతికి చేరుకున్నారు.
తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ హీరోకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి సుప్రభాత సేవ, స్వామివారి సేవలో శాస్త్రోక్తంగా పాల్గొన్నారు ప్రభాస్. గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. తన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ప్రభాస్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు పండితులు. తిరుమలలో ప్రభాస్‌ను గమనించిన అభిమానులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. డార్లింగ్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి అభివాదం చేశారు.
#Prabhas in Tirumala #Adipurush pic.twitter.com/NfGrxxPseV
— GSK Media (@GskMedia_PR) June 6, 2023
Ahead of #AdipurushPreReleaseEvent in Tirupati, Pan India Superstar #Prabhas had a break Darshanam at Tirumala early this morning. #Adipurush pic.twitter.com/hvHGKbQpEL
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 6, 2023