పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు.
వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్నవారు కొందరే ఉంటారు. ఒత్తిడిని తట్టుకుని ఎదిరేగేవారు అరుదుగా ఉంటారు. ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు, అంచనాలను అందుకునే వారే విజేతలుగా నిలుస్తారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొననుంది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇవాళ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ విషయంలో కొన్ని పాయింట్లను లేవనెత్తారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ విషయంలో తెలంగాణ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో బీజేపీ కార్యకర్త హస్తం ఉందని వెల్లడించారు.
ఈడీ విచారణ తర్వాత ప్రగతి భవన్ లో కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈడీ విచారణలో అడిగిన అంశాలతోపాటు తాజా పరిణామాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది.