చింతమనేని ప్రభాకర్.. తెలుగు రాజకీయాల్లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వరుస వివాదాలతో వార్తల్లో నిలవడం చింతమనేనికి అలవాటే. అయితే.., అవన్నీ ప్రజల కోసం చేస్తున్న పోరాటాలే అంటారాయన.
2019 ఎన్నికలకి ముందు దెందులూరు నియోజకవర్గంలో నన్ను ఢీ కొట్టే మగాళ్లు లేరని మీసం మెలేసిన చింతమనేని.. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చింతమనేని అధికారంలో లేకపోయినా.. దెందులూరులో మాత్రం వర్గ పోరుకి బ్రేక్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ అవుతోంది.
“మీడియా అంతా కలసి టి.ఆర్.పి రేటింగ్స్ కోసం నన్ను రౌడీగా చిత్రీకరించాయి. వనజాక్షి గారికి మాత్రం ఆ విషయంలో మంచి పేరు వచ్చింది. టీడీపీ ఓటమికి చంద్రబాబు అతి మంచితనం కారణం, నాపై వైసీపీ పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అంటూ” చింతమనేని చేసిన వ్యాఖ్యలతో ప్రోమో మొత్తం స్పైసీగా సాగింది. ఇక చింతమనేని ఇంటర్వ్యూ ప్రోమోనే ఇంత ఆసక్తిని కలిగిస్తుంటే.. ఫుల్ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.