దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. కలిసిన అనంతరం ఆయన వ్యూహం అనే సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన అలా ప్రకటించారో రాజకీయంగా తీవ్ర దుమారం లేపింది. దీనిపై పలు రాజకీయ పార్టీ నాయకులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత పట్టాభి రామ్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. అతనొక ప్లాప్ డైరెక్టర్ అని, వర్మ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోదలచుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా పట్టాభి వ్యాఖ్యలపై వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్లు ఎందుకు టీడీపీ బ్యాచ్ హైరానా కంగారు పడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.
ముద్దుగా, బొద్దుగా, రసగుల్లాలా ఉంటాడంటూ పట్టాభిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాను సీఎం జగన్ ని ఎందుకు కలిశానో తెలియకుండా అలా ఎలా మాట్లాడతావని ప్రశ్నించారు. తాను బ్యాడ్ డైరెక్టర్ అని, ప్లాప్ డైరెక్టర్ ని నువ్వే అన్నప్పుడు టెన్షన్ ఎందుకు? అంటూ ప్రశ్నించారు. తాను ఒక మనిషి పేరు గానీ, సబ్జెక్టు గానీ చెప్పనప్పుడు నీకు నువ్వే ఊహించేసుకుని భయపడిపోయి నీ పార్టీ వాళ్లందరినీ భయపెట్టేస్తున్నావంటూ పట్టాభిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రసగుల్లాలా స్వీట్ గా ఉండడం మానేసి మిరపకాయలా యాక్ట్ చేస్తే బీపీ, షుగర్ వచ్చి పోతావంటూ విమర్శలు చేశారు. నీ ఇంట్లో వాళ్లకి నీ అవసరం ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సాంబ అంటూ పట్టాభికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వర్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.