Prashant Kishor: ప్రశాంత్ కిషోర్.. గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో సెన్సేషన్‌గా నిలుస్తున్న పేరిది. అందరూ ఈయన్ని ముద్దుగా పీకే అని పిలుస్తుంటారు. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిని చేయటంలో ఆయన వ్యూహాలు సక్సెస్ అవ్వటంతో దేశమంతా ఆయన పేరు మారుమోగింది. నితీష్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంకే స్టాలీన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ వంటివారిని ముఖ్యమంత్రులుగా చేయటంలో ఆయన కృషి అమోఘం. 2021 ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీ విజయం తర్వాత ఇకపై రాజకీయ వ్యూహకర్తగా ఉండబోనని పీకే ప్రకటించారు. ఆ తర్వాతనుంచి యాంటీ బీజేపీ స్లోగాన్‌తో పనిచేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన్ని తమ పార్టీలో చేర్చుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
గత కొన్ని నెలలుగా పీకే కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పీకే కొత్త పార్టీని తెరపైకి తెచ్చారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. బిహార్‌నుంచి తన ప్రస్థానం మొదలవుతుందని వెల్లడించారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే నా తపన, ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయం చేయడం.. 10 ఏళ్ల రోలర్‌కోస్టర్ రైడ్‌కు దారితీసింది. ప్రజలకు చేరువ కావాల్సిన సమయం వచ్చింది.ప్రజల సమస్యలను అర్థం చేసుకోవటానికే ‘‘ జన్ సురాజ్’’. మంచి పాలన కోసం. బిహార్‌నుంచి ప్రారంభం అవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ తెరపైకి రావటంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీకే కాంగ్రెస్‌కు దూరమవుతారా? లేక పార్టీ తరుపున మద్దతు ఇస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. మరి, పీకే కొత్త పార్టీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ministers Talasani: AP మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.