వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ వేరే పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన సోదరి షర్మిల కీలక పాత్ర పోషించారు. జగన్ గెలుపులో తోడు ఉన్న ఆమె ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రియదర్శిని రామ్ వెల్లడించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సెపరేట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో షర్మిల కూడా జగన్ తో పాటే ఉంటూ ప్రచారం చేశారు. ప్రజల్లో తిరుగుతూ జగన్ గెలుపులో కీలక పాత్ర వహించారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టారు. అయితే షర్మిల పార్టీ పెట్టడానికి కారణం జగన్ తో విబేధాలు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అసలు కారణం ఇది కాదని.. వేరే ఉందని ప్రియదర్శిని రామ్ వెల్లడించారు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియదర్శిని రామ్.
టాస్, మనోడు సినిమాలకు దర్శకత్వం వహించారు. బెంగాల్ టైగర్, జ్యోతిలక్ష్మి, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక శైలిని సెట్ చేసుకున్న ప్రియదర్శిని రామ్.. తాజాగా సుమన్ టీవీ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటో వెల్లడించారు. ప్రియదర్శిని రామ్ వైఎస్ఆర్ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటారు. రాజశేఖర్ రెడ్డితో కూడా చాలా చనువుగా ఉంటారు. ఇప్పటికీ వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మలతో మంచి సంబంధం కలిగి ఉన్నారు.
అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ తనతో చెప్పిన విషయాలను ప్రియదర్శిని రామ్ మీడియాతో పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్న కలలు పూర్తి కాలేదని, చెప్పులు లేకపోయినా గానీ అవన్నీ పూర్తి చేయాలని జగన్ తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలానే షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి అనుకున్నవి ప్రజలకు చేరాలన్నది షర్మిల భావించారని ఈ కారణంగానే తెలంగాణలో పార్టీ పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేగానీ జగన్ తో ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ఇప్పటికీ జగన్, షర్మిల కలిసే ఉంటున్నారని అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: జగన్, షర్మిల మధ్య విభేదాలు అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన ప్రియదర్శిని రామ్