మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్ సమావేశానికి తాను హాజరు కాలేదని.. అందువల్ల తనకి పూర్తి వివరాలు తెలీదన్నారు. ‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఈ ప్రకటన ఇంటర్వెల్ మాత్రమే. శుభం కార్డుకు చాలా సమయం ఉంది. రాజధాని పేరుతో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులే వారిని వెనుక నుంచి నడిపించేది తెలుగుదేశం’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
తాను ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే ఉపసంహరణ అంటూ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్న పెద్దిరెడ్డి.. అమరావతి రైతుల పాదయాత్ర ఏమైనా లక్షలమందితో సాగుతోందా? అని ప్రశ్నించారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని.. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే ఉపసంహరించుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పునరుర్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.