ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను చూస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా అరవటం మొదలు పెట్టారు. ఆమెను చూస్తూ ‘ పవన్ సీఎం’ అంటూ కేకలు వేయటం మొదలుపెట్టారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ నగల షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమెకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. ఆమె కార్యక్రమంలో ఉన్నంత సేపు గట్టిగా పవన్ నామ జపం చేశారు. దీంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా, మంత్రి రోజా బుధవారం విజయవాడలో జరిగిన బీఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆర్కే రోజాతో పాటు ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమా సెలెబ్రిటీలు పాల్గొంటున్నారని తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఇలా వచ్చిన వారిలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మంత్రి రోజా తన కారులో కార్యక్రమం జరుగుతున్న చోటుకి వచ్చారు. ఆమె కారులోంచి బయటకు దిగగానే పవన్ ఫ్యాన్స్ ఆమెను చూశారు. ఆ వెంటనే పవన్ సీఎం అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఫ్యాన్స్ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. పవన్ ఫ్యాన్స్ అరుపుల మధ్యే ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి అరుపుల కారణంగా కొంత ఇబ్బందిపడ్డా.. ఆమె పెద్దగా పట్టించుకోలేదు.. నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. కాగా, మంత్రి రోజాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య గతకొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటుడిపై కామెంట్లు చేయటాన్ని పవన్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రోజాకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.