వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నిత్యం సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆర్‌ఆర్‌ఆర్.. సోషల్ మీడియాలో రచ్చబండ అనే ఒక ప్రత్యేక వీడియోను ప్రతి రోజు విడుదల చేస్తుంటారు. ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్పందిస్తుంటారు. తాజాగా గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన తన అభిమానులకు సారీ చెప్పారు.
ఎప్పుడూ హుందాగా, పద్దతిగా మాట్లాడే తను.. బుధవారం రచ్చబండ వీడియోలో అసభ్యపదజాలం వాడినట్లు, వాటిపై తనను అభిమానించే వారు, శ్రేయోభిలాషులు అభ్యంతరం తెలిపినట్లు రఘురామ తెలిపారు. అందుకే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేశారు. భావావేశం ఆపుకోలేక బూతులు వాడటం తన తప్పే అని రఘురామ పేర్కొన్నారు. కాగా.. బుధవారం రోజు రిలీజ్ చేసిన వీడియోలో ఆయన వైసీపీ నేతలపై పరోక్షంగా ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
జగనన్న బడి మూత, జగన్ కుట్ర – నా లేఖ మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు “రచ్చబండ” – Live… https://t.co/miw7uRebbt
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 7, 2022
దొరికితే పోలీస్ – చంపితే ఆగంతకులు (రాష్ట్ర ప్రభుత్వ క్రైమ్ కథలు) మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు “రచ్చబండ” – Live… https://t.co/v1lTphcMSP
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 6, 2022