సందర్భం దొరికిన ప్రతి సారి సొంత పార్టీ నేతలు, విధానాలపై విమర్శలు చేసే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తొలిసారి తన స్వరం మార్చారు. సొంత పార్టీ నేతల మీద విమర్శల బదులు ప్రశంసలు కురిపించారు. మరి రఘురామ కృష్ణ రాజు ఎవరిని పొగిడారు.. ఎందుకు అనేది తెలియాలంటే ఇది చదవండి..
రాజకీయాల్లో ఇటు పుల్ల అటు కదిలినా.. అటు పుల్ల ఇటు కదిలినా సరే.. దాని వెనకే పెద్ద కారణమే ఉంటుంది అంటారు రాజకీయ విశ్లేషకులు. కారణం లేకుండా.. రాజకీయాల్లో చిన్న సంఘటన కూడా చోటు చేసుకోదు అంటారు. ఇక రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలు, వ్యూహాలు కూడా.. ఏదో ఆశామాషీగా.. అప్పటికప్పుడు తీసుకునేవి అయి ఉండవు. వాటి వెనక ఏవో బలమైన కారణాలుంటాయి. పైగా వాటి గురించి ముఖ్య నేతలు, తన సన్నిహితులతో అన్ని రకాలుగా చర్చించి.. […]
వైసీసీ రెబెల్ లీడర్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. సీఎం జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయలేమంటూ ఉత్తర్వులు ఇస్తూ.. రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు జగన్ షరతులను ఉల్లంఘించిన సంఘటక ఒక్కటి […]
యుద్ధంలో గెలవాలంటే.. ముందుగా రాజును దెబ్బతీయాలి. దాంతో సైన్యం పరారవుతుంది. రాజకీయాలు అనే యుద్ధంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు కొందరు నాయకులు. వేర్లనే టార్గెట్ చేయాలి.. అప్పుడు చెట్టు దానంతట అదే కూలిపోతుందని భావిస్తారు. తన ప్రత్యర్థులు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు సీఎం సన్నిహితులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే క్యాడర్‌ని సిద్ధం చేస్తున్నారు జగన్. […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వార్ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే ఆయన అనేక విధాల ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇబ్బందికరంగా మారారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేలా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నా న్యాయస్థానాల ద్వారా ఊరట పొందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం రఘు రామను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మోదీ […]
నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు నిత్యం తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లు వేస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన విషయంలో ప్రతిపక్షం కంటే ఎక్కువ రామ కృష్ణరాజు గారే విమర్శిస్తుంటారు. ఆయనకు ధీటుగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కృష్ణం రాజుపై విరుచుకుపడుతుంటారు. తమ సీఎం అవినీతి కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ గతంలో రామకృష్ణరాజు కోర్టులకు సైతం విన్నవించడం అందరికి తెలిసిందే. మరి సొంత పార్ట […]
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. ఏకంగా సీబీఐ చీఫ్‌కు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. పరిటాల కేసులో మాదిరిగానే నిందితులను అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో మాదిరిగానే నిందితులను […]
త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ నిమిషమైనా రాజీనామా చేయవచ్చు. లేదంటే వైసీపీనే ఆయనపై వేటు వేయవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రఘురామా అడుగులు ఎటువైపు పడతాయి.. ఆయన బీజేపీలో చేరతారా.. లేక టీడీపీలో జాయిన్ అవుతారా అనే చర్చ సాగుతున్న సమయంలో తాజాగా ఓ కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. […]
నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఊహించిన అనుభవం ఎదురయ్యింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో కొందరు వ్యక్తులు రఘురామకు పాలాభిషేకం చేశారు. అదేంటి రఘురామ నియోజకవర్గం నరసాపురం కాగా.. ఆయనకు ప్రకాశం జిల్లాలో పాలాభిషేకం నిర్వహించడం ఏంటనుకుంటున్నారా.. అయితే పూర్తి మ్యాటర్ తెలియాలంటే.. ఇది చదవండి. కొన్ని రోజుల క్రితం ఏపీలో చింతామణి నాటకం.. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు ఎప్పటి […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించే నరసాపురం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఒక సారి జైలుకు వెళ్లి వచ్చిన ఆయనపై మరో కేసు నమోదు అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత […]