మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మోత్కుపల్లి నరసింహులు సంచలనం వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడి ఈటెలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి చాల అవినీతిపరుడని, అక్రమదారుడని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలతో అక్రమంగా ఎన్నో ఎకరాల భూమిని సంపాదించాడని అన్నారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను ఈటెల చేరికపై స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏమి లేని వ్యక్తిగా ఉన్న ఈటెల నేడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
ఇక నేను ఈటెలతో దళిత, దేవాలయ భూములను వెనక్కి ఇవ్వాలని చెప్పానని, అయినా నా మాట పెడచెవిన పెట్టలేదని ఆయన అన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో అలాంటి వ్యక్తిని ఊరేగిస్తున్నారని మండిపడ్డారు. ఇక ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కావాలనే భూ కబ్జాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఏ విధంగా చేర్చుకున్నారో నాకు అర్ధం కావట్లేదని అయన అన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వవల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈటెల అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధిని మరిచి అక్రమాలకు పాల్పడ్డారని , అలాంటి వ్యక్తి మళ్లి గెలిస్తే దళిత, దేవాలయ భూములను లాక్కుంటాడు తప్పా ప్రజలకు సేవ చేయలేడని ఆయన అన్నారు.
ఇప్పటికైన ప్రజలు గుర్తించి ఈటెలను హుజురాబాద్ఉప ఎన్నికల్లో ఓడించాలని ఆయన సూచించారు. ఇక స్వతంత్రం వచ్చిన నాటి నుంచి దళిత సామాజిక వర్గాలన్నీ అణిచివేయబడ్డాయని మోత్కుపల్లి అన్నారు. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ తానే స్వయంగా నాకు ఫోన్ చేశారని, దళితుల అభివృద్ధి విషయంలో మీ సలహాలు సూచనలు కావాలని అఖిల పక్ష సమావేశానికి రామన్నరని అందుకే నేను వెళ్లాలని అయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి నేను వెళ్లడం రాష్ట్ర బీజేపీ నేతలకు నచ్చకే నన్ను వెళ్లనివ్వలేదని, అయినా సరే నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. ఇక రేపో మాపో మత్కుపల్లి తెరాస లో చేరబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఆయన తెరాస లోకి వెళ్తున్నారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.