మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మోత్కుపల్లి నరసింహులు సంచలనం వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడి ఈటెలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి చాల అవినీతిపరుడని, అక్రమదారుడని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలతో అక్రమంగా ఎన్నో ఎకరాల భూమిని సంపాదించాడని అన్నారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను ఈటెల చేరికపై స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏమి లేని వ్యక్తిగా […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో […]
హైదరాబాద్- తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై చర్యలు మొదలయ్యయి. భూకబ్జా ఆరోపణల నేపధ్యంలో విచారణ చేపట్టిన ప్రభుత్వం.. ఆయనపై వేటేసింది. ఈటెల చూస్తున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ ఏ శాఖ లేని మంత్రిగా మారారు. ఇదిలా ఉండగా […]
హైదరాబాద్- తన మొత్తం ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, సన్యాసం కూడా తీసుకుంటానని అన్నారు. ఉన్నతాధికారులు, సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేసుకోవచ్చని ఘాటుగా స్పందించారు. ఈ ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదని.. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు […]