మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆమోదానికి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. అనంతరం గన్‌పార్క్ సందర్శించిన ఈటల తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఈటెల రాజేందర్ జూన్ 14న బీజేపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది.
ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈటల అసైన్డ్‌భూముల కొనుగోలు ఆక్రమణలు చేశారంటు రైతులు సీఎంకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సీఎం సీఎస్ అధ్యర్యంలో రెవెన్యు ., విజిలెన్స్ కమిటిలు వేసి అత్యవసరంగా విచారణ జరిపించారు. దీంతో రాజీకియంగా దెబ్బతీయడంతో ఆత్మభిమానాన్ని దెబ్బ తీసే కుట్రకు సీఎం తెరలేపారని ఈటల రాజేందర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.