అసెంబ్లీ లోపల ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఏం చేస్తారు.. అన్నది తెలుకోవాలనుకోవానుకుంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి ప్రజా క్షేత్రంలో నాయకుడిగా పోటీ చేసి.. గెలుపొంది.. ఆపై అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడం. లేదా విజిటర్ పాస్ తీసుకొని ఆ దృశ్యాలను కాసేపు వీక్షించడం. అంతేకానీ, సూటు.. బూటు వేసుకొని ఓ మనమూ ఎమ్మెల్యే అవుదాం అంటే కుదరదు. ఓ వ్యక్తి ఇలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
అసెంబ్లీ అంటే ఏంటి..? లోపల ఎలా ఉంటది..? సమావేశాలు ఎలా నిర్వహిస్తారు..? పాటించే పద్ధతులేంటి..? చట్టాలు ఎలా రూపొందుతాయి..? వంటివి తెలుసుకోవాలన్న కుతూహలం అందరికి ఉంటుంది. ఈ సందేహాలు ఉన్నప్పుడు.. వాటి నివృత్తి చేసుకోవాలనుకుంటే సాధారణ ప్రజలు.. విజిటర్ పాస్ తీసుకొని వారికి కేటాయించిన స్థలాల్లో కూర్చోవాలి. అంతేకానీ, నకిలీ ఎమ్మెల్యే అవతారం ఎత్తి లాబీలోకి వెళ్లి కూర్చుంటామంటే కుదరదు. కానీ, ఓ వ్యక్తి దర్జాగా సూటు.. బూటు వేసుకొని అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని వాలకం చూసి అతడు నిజంగానే ఎమ్మెల్యే అనుకున్న అసెంబ్లీ ఎంట్రీ గేట్ సిబ్బంది అతన్ని లోపలకి అనుమతిచ్చారు. కానీ, లాబీలోకి ఎంట్రీ ఇచ్చేలోపు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
పైన తెల్ల షర్ట్. దానిపై కోటు వేసుకొన్న గజానన్ వర్మ అనే వ్యక్తి బెంగాల్ అసెంబ్లీకి ప్రవేశించాలనుకున్నాడు. అందుకోసం ఎంట్రీ గేట్ సిబ్బందికి తాను హౌరాలోని శిబ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మనోజ్ తివారీగా పరిచయం చేసుకున్నాడు. ఏ మాత్రం బెదురు లేకుండా అతడు మాట్లాడుతుండడంతో ప్రశ్నలు సాధించడం సరికాదనుకున్న ఎంట్రీ గేట్ సిబ్బంది అతనిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిచ్చారు. అనంతరం అసెంబ్లీ లాబీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మెయిన్ గేట్ భద్రతా సిబ్బంది అడ్డుకొని ప్రశ్నించడంతో అతని బండారం బయటపడింది. పొంతనలేని సమాధానాలివ్వడంతో సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శమిస్తున్నాయి.
A fake MLA has been nabbed today inside the Assembly and he was trying to get in to the Assembly house giving his identity as MLA.
The person has been nabbed by the Assembly Marshal after he was enquired about his identity and taken to Hare Street Police Station pic.twitter.com/az2NIhYl10
— Syeda Shabana (@ShabanaANI2) February 15, 2023
అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, నకిలీ ఎమ్మెల్యే అసెంబ్లీలోకి ప్రవేశించాలనుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మమతా సర్కార్- బీజేపీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఏదేమైనా.. ఇప్పటివరకు ఫేక్ డాక్టర్స్, ఫేక్ ఆఫీసర్స్‌ను చూశాం.. కానీ ఇలా ఓ నకిలీ ఎమ్మెల్యే వెలుగులోకి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. పైగా నెటిజన్స్ అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ప్రశంసిస్తుండటం గమనార్హం. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.