గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఒక్కోసారి టైర్లు పేలిపోవడం, ఊడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు రన్నింగ్ లో టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసన తర్వాత ఇంటికి వెళ్తున్నారు.. దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ వద్దకు రాగానే అకస్మాత్తుగా ఆయను బుల్లెల్ ప్రూఫ్ కారు టైరు ఊడిపోయింది. దీంతో వాహనం ఒక్కసారే పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. తన బండి డ్యామేజ్ గా ఉంది.. చాలా సార్లు నడిరోడ్డుపై ఇబ్బంది పెట్టింది.. తనకు వేరే వాహనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు.. ఈ రోజు అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఏకంగా బండి టైర్ ఊడిపోయింది.. బండి స్పీడ్ గా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం అయి ఉండేదో ఊహించుకోండి.. నా భద్రత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ వాహనం రోడ్డు పై పలుమార్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఆయన వేరే వాహనంలో ఇంటికి చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన పరిస్థితి గ్రహించి వెహికిల్ ని వెంటనే మార్చాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.