తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారంటూ బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు దళిత కుటుంబాలకు అందిస్తున్న దళిత బంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ రాజకీయ పరిధిని దాటొచ్చి వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. ఇక ఏదేమైన చీకటి ఒప్పందాలను హుజురాబాద్ ప్రజలు ఖచ్చితంగా తిప్పికొట్టి దిమ్మతిరిగే సమాధానం ఇస్తారని కేటీఆర్ తెలిపారు.