Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ రెబల్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా ఆయన రాజీమానా చేశారు. మంగళవారం రాత్రి ఈ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా. నా మనసుకు ఏది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోమని కార్యకర్తలు చెప్పారు. ఎక్కువ రోజులు నాన్చే ఉద్దేశం లేదు.
జాతీయ నాయకత్వం బలహీనపడటం వల్ల పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయా. తెలంగాణను ఓ కుటుంబం పాలిస్తోంది. ప్రతిపక్ష నేతగా ఓ దళితుడు ఉండటాన్ని ఓర్చుకోలేకపోయారు. సొంత పార్టీలోనూ, బయట నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను రాజీనామా చేస్తే డెవలప్మెంట్ అవుతుందేమో. అందుకే రాజీనామా అంశాన్ని తెరమీదకు తెచ్చా’’ అని అన్నారు. మరి, కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.