దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన కర్ణాటక ఫలితాలను రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే కమాలానికి గుడ్డుకాలం మొదలైందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన కర్ణాటక ఫలితాలను రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 136, బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే ఆధిక్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ దారుణమైన ఓటమి మూట కట్టుకుంది. అయితే ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే కమాలానికి గుడ్డుకాలం మొదలైందా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది.
భారతీయ జనత పార్టీ.. చాలా ఏళ్ల క్రితం ఓ చిన్న పార్టీగా ఏర్పడి.. నేడు ఓ బలమైన పార్టీగా ఏర్పడింది. ఓ సాధారణ పార్టీగా ఏర్పడిన బీజేపీ.. ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ 2014 నాటికి ఓ శక్తివంతమైన పార్టీగా అవతరించింది. ఇక మోడీ సారథ్యంలో 2014 అధికారంలోకి వచ్చిన బీజేపీ వరసగా రెండో సారి 2019 కూడా కేంద్రంలో అధికారం దక్కించుకుంది. ఈ మధ్యలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి.. తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే ఇప్పటి వరకు తమకు ఎదురులేదనుకున్న బీజేపీకి కర్ణాటక ఫలితాలు కళ్లు తెరిపించాయి. ఈ ఫలితాలను చూసిన రాజకీయ విశ్లేషకులు కమలానికి గడ్డు కాలం ఏర్పడిందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనేది ప్రతిపక్షలా ఆరోపణ. అందుకు తగ్గట్లే కేవలం గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రల్లో మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాలను నడిపిస్తుంది. మిత్రపక్షాలు కూడా ఎప్పుడు హ్యాండ్ ఇస్తాయో అర్థం కాని పరిస్థితి. అందుకు ఉదాహరణే శివసేన పార్టీ. అందుకే తాజాగా కర్ణాటక ఎన్నికల్లో ఏ మిత్రపక్షాలను నమ్ముకోకుండా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది.
డీఎంకే, బీఆర్ఎస్, టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల్లో పరోక్షంగా ప్రభావం చూపించాయి. సుదీర్ఘ కాలం బీజేపీ పాలనతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో చాపకింద నీరులా మరోవైపు కాంగ్రెస్ కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తు బాగా పుంజుకుంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కూడా బీజేపీని బాగా దెబ్బకొట్టింది. అందుకు నిదర్శనమే కర్ణాటకలో వచ్చిన ఫలితాలు. కర్ణాటకలో రాహుల్ 56 స్థానాల్లో జోడే యాత్ర చేస్తే.. 36 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అంటే ప్రజలు బీజేపీపై వ్యతిరేకంగా ఉంటూ కాంగ్రెస్ పై సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. తెలంగాణలో కూడా బాగా వేయాలనుకున్న బీజేపీ బ్రేక్ లు పడ్డాయి. ఈ ఫలితాలతో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత, సరైన మిత్ర పక్షం లేకపోవడం, కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, సుదీర్ఘ పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైదనట్లే కనిపిస్తుంది. మరి.. 2024 ఎన్నికల్లో ఇదే తీర్పు రిపీట్ అవుతుందా లేక మరే విధంగా తీర్పు వస్తుందా? అనేది వేచి చూడాలి. మరి.. కమలానికి గడ్డు కాలం మొదలైందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.