కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం వేడుక కాంగ్రెస్ బలప్రదర్శన అన్నట్లు కనిపించింది.
ఇటీవలే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ గెలవడానికి ఎంత కష్టపడిందో.. ఆ తరువాత ముఖ్యమంత్రి ఎంపికకు అదే స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటి నెలకొంది. చివరకు కర్ణాటక సీఎం పీఠం సిద్ధరామయ్యను వరించింది. శనివారం కంఠీరవ స్టేడియం వేదికగా కర్ణాటక మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకరం వేడుకు కాంగ్రెస్ బలప్రదర్శన అన్నట్లు కనిపించింది.
కర్ణాటక ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య చేత గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరిద్దరి తోపాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కాంగ్రెస్, ప్రతి పక్షాల బల ప్రదర్శనగా నిలిచింది. సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.
దేశంలోని బీజేపీ వ్యతిరేక నేతలందరూ కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు. 2014 తర్వాత ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి రావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఈ వేడుకకు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సీఎం, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ సీఎం నితీష్ ఈ వేడుకకు హాజరయ్యారు.
అలానే బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కశ్మీరీ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డీ రాజా, శరద్ పవార్, ఫారుఖ్ అబ్ధుల్లా వంటి వారు కూడా పాల్గొన్నారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్రణాళిక చేస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా అర్ధమవుతుంది. ఈ సభతో 2024 సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలతో కలిసి వస్తామని కాంగ్రెస్ పరోక్షం బీజేపీని హెచ్చరించింది. మరి.. సిద్ధు ప్రమాణస్వీకారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.