ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రనిర్వహించారు.కౌలురైతు కుటుంబాలను కలుసుకుని ఒక్కొ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరా నాకు చెప్పేది అంటూ ఓ రేంజ్ లో వైసీపీ నాయకులపై పవన్ ఫైర్ అయ్యారు.
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మరికొన్ని కుటుంబాలను పరామర్శించి .. చింతలపూడిలో ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..” సీఎం పదవికి నేను గౌరవం ఇస్తున్నాను. అందుకే మీరు అని అంటున్నాను. అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. వైసీపీ నేతలకు సంస్కారం లేదు. చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరా నాకు చెప్పేది.
ఇప్పుడు నా సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మింది. వైసీపీ నాయకులు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే నేను కచ్చితంగా ప్రశ్నిస్తాను. ప్రజల పన్నులతో వచ్చిన నిధుల్ని మీరు ఇస్తున్నట్లు చెప్పడం ఏంటి? అభివృద్ధి అంటే బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లు అమ్మడమా! వైసీపీ ప్రభుత్వం ఘోరమైన పాలన చేస్తోంది. సమస్యకు పరిష్కారం చెప్పకుండా నేను మాట్లాడను. ప్రతి సమస్య మీ వల్లే వచ్చిందని నేను వైసీపీని అనడం లేదు. విజయవాడ అత్యాచార ఘటన విషయంలో పోలీసుల్ని నేను ఏమి అనలేదు. వైసీపీ నాయకుల ఆగడాలకు పోలీసులు సైతం విసుగిపోతున్నారు” అంటూ పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు.మరి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.