సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. అంతేకాక అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా స్పందిస్తుంటారు. అంతేకాక అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ఆయన ఇటీవలే ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి రాష్ట్రం బాగు కోసం తాను మాట్లాడుతున్నానంటూ మూడు వీడియోలను విడుదల చేశారు. దీంతో కొందరు తమ్మారెడ్డిపై బూతులతో విరుచుకుపడ్డారు. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.
తానేదో తప్పు చేశానని అనుకుని కొందరు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. అలానే వారు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని తాను మాత్రం సమాజంపై ప్రేమతో మాట్లాడుతున్నాని తమ్మారెడ్డి అన్నారు. తాను ఈ మధ్య వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు మూడు వీడియోలను పోస్ట్ చేశానని, వాటిని ఓ విధంగా లేఖలుగా అనుకోవచ్చని అన్నారు. అందులో నాకు తెలిసిన విషయాలను, అభిప్రాయాలను పోస్ట్ చేశానని ఆయన అన్నారు. ఆ పార్టీలకు చెందిన అభిమాలు స్పందించారు. అయితే కొందరు మాత్రం బూతులు తిడుతూ సందేశాలు పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..”బూతులు తిడుతున్న వాళ్లందరికీ నా నమష్కారాలు. ఎందుకంటే నేను రాష్ట్రం బాగు కోసం వీడియో చేస్తే.. దానిపై స్పందించకుండా ఇలా చేయడం వాళ్ల సంస్కారం. నేను వారిలా నా సంస్కారాన్ని కోల్పోయి సమాధానం చెప్పలేను. పవన్ కళ్యాణ్‌ను కదిలించాడని, ఆయనకు శత్రువులు ఎక్కడో లేరని కొంత మంది అంటున్నారు. ఇక్కడ పవన్ కు నేనెందుకు శత్రువు అవుతాను. ఒకవేళ ఆయన శత్రువు అయితే చంద్రబాబు నాయుడుగారికి, జగన్ మోహన్ రెడ్డిగారికి కూడా శత్రువులే కావాలి కదా?. ఎందుకంటే ఆ ముగ్గురిని ఒకే ఒక ప్రశ్న అడిగాను. వారు వారు చెప్పిన మాటలను ప్రశ్నించాను.
ఇలా ముగ్గురు నాయకులకు ఈ ప్రశ్నే వేశాను. పవన్ కళ్యాణ్ గారినే నేను ఎందుకు కెలుకుతాను. ఒకవేళ అలా కదిలిస్తే ముగ్గురుని కెలికినట్లే కదా?. నాకు తెలుగు రాష్ట్రాలు బావుండాలనేదే నా ఆశ. మీరు తిట్టినా, రక్కినా, చంపినా దేశంపై ప్రేమతో నేను మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటాను. మీరు తిడితే నేను పారిపోతానని అనుకుంటే అది భ్రమే. మీరు ఆ భ్రమలో బ్రతికి దేశానికి అన్యాయం చేస్తున్నారని నా అభిప్రాయం” అంటూ తమ్మారెడ్డి అన్నారు. మరి.. తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.