తాజాగా జరిగిన ఓ సంఘటన నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ట్వీటర్ వేదికగా ఎమోషన్ పోస్ట్ ను షేర్ చేశాడు మెగాబ్రదర్ నాగబాబు. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది ఏంటి? అంటే.. చాలా మంది చెప్పే ఒకేఒక్క మాట డబ్బు. అయితే ఈ డబ్బు కంటే విలువైంది, శక్తివంతమైంది రాజకీయాల్లో మరోకటి ఉంది. ఆ శక్తి పేరు కార్యకర్తలు.. అవును ఏ దేశ రాజకీయాల్లో అయిన కార్యకర్తలకు ఉన్న స్థానం.. మరే ఇతర వాటికి ఉండదు. మరి అలాంటి కార్యర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడినే వారు కూడా గుండెల్లో పెట్టుకుని, ఆ నాయకుడి వెంట నడుస్తారు. మరి అలాంటి నిస్వార్థమైన కార్యకర్తలకు ఏదైన సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించడం నాయకుడి తొలి విధి. ఇక జనసేన నాయకుడు, అంతకు మించి వీరాభిమాని మరణించడం నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు మెగాబ్రదర్ నాగబాబు.
మెగాబ్రదర్ నాగబాబు.. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. జన సైనికులకు, జనసేన నాయకులను దగ్గర అయ్యారు. ఇక జన సైనికుల్లో ఏ సైనికుడికి ఆపద వచ్చిన ముందుంటారు నాగబాబు. తాజాగా ఓ జనసేన నాయకుడిని, అంతకు మించి విరాభిమానిని కోల్పోయాం అంటూ బాధపడుతున్నాడు నాగబాబు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నానాజీ అనే వ్యక్తి జనసేన నాయకుడిగా, అంతకు మించి వీరాభిమానిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాజాగా నానాజీ అకాల మరణం పొందాడు. ఈ ఘటన నన్నెంతో బాధించింది అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు మెగాబ్రదర్ నాగబాబు.
ఈ క్రమంలోనే తన ట్వీటర్ వేదికగా నానాజీ మృతిపై ఎమోషన్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో “నాకెంతో ఆప్తులు, జనసేన నాయకులు, అంతకంటే ఎక్కువగా పార్టీకి, మాకు వీరాభిమాని అయిన నానాజీ గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అంటూ ట్వీటర్ వేదికగా రాసుకొచ్చారు. జనసైనికులకు, జనసేన నాయకులకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు పవన్ కళ్యాణ్, నాగబాబు. తాజాగా జనసేన నాయకుని మరణం బాధించింది అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
నాకెంతో ఆప్తులు, జనసేన నాయకులు, అంతకు మించి వీరాభిమాని అయిన నానాజీ గారి అకాల మరణం నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది, ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను… pic.twitter.com/2uRVR8vNJC
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 20, 2023