సెలబ్రిటీలను వారి చిన్నతనంలో చూస్తే మనం అస్సలు గుర్తు పట్టలేము. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ సెలబ్రిటీ.. ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది పోయింది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న సమాచారం అంతా నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వారి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అలానే బాలనటులుగా నటించిన.. వారు పెరిగి పెద్దైన ఉండే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలోని చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చి మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. ఇప్పటికి ఆ సినిమా పేరు చెప్పగానే ఆ అమ్మాయి గుర్తుకు వస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా?. బంగారం మూవీలో వింధ్యారెడ్డి పాత్రలో నటించిన ఆ చిన్నారి అసలు పేరు శనూష.
మలయాళంకు చెందిన.. ఆమె అక్కడ పలు చిత్రాల్లో బాలనటిగా నటిచింది. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి అవార్డులను గెలుచుకుంది. బంగారం సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. బంగారం సినిమాలో బాలనటిగా శనూష ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆమె వయస్సు కేవలం 10 ఏళ్లే. ఈ సినిమాలో పవన్ ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. తెలుగులో బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి ఈ అమ్మాయి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు వారిని పలకరించింది.
అయితే ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. శనూష తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంట మూవీలో కీలకపాత్రలో నటించింది. 2019లో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆ సినిమాలో ఈ అమ్మడి పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో శనూష బిజీగా ఉంది. చిన్న తనం నుంచే ఎంతో క్యూట్‌గా ఉంది శనూష. ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.