ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడివేడిగా సాగుతున్నాయి. అధికార , ప్రతి పక్షాల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. ఇంతకాలం తెదేపా, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతు వస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి జనసేన పార్టీ కూడా అధికార వైసీపీ పై విమర్శనాస్త్రాలు సందిస్తూ దూకుడు పెంచింది. ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రభుత్వం పై పవన్ ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు. పవన్.. కార్టూన్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఏపీలోని రోడ్ల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్నాయని జనసేన ఆరోపిస్తుంది.ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉంటూ కలలు కంటున్నారని జనసేన అంటోంది.. ఆయన్ను మేల్కొలిపి రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తామని చెబుతోంది. ముఖ్యమంత్రిని నిద్ర లేపే కార్యక్రమం కాబట్టి “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అని పేరు పెట్టామని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ క్రమంలో జగన్ పై పవన్ కల్యాణ్ వరుసగా ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గుంతలు గా ఉన్న రోడ్డు వీడియోను ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. సీఎం జగన్ పై జనసేన అధినేత చేస్తున్న వరుస ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
#GoodMorningCMSir pic.twitter.com/9VYlpiQTT5
— Pawan Kalyan (@PawanKalyan) July 15, 2022
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2022