గురువారం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు.. తమ రాజీనామ లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలోనే ఈ నెల11న కొత్త మంత్రిమండలి కొలువు తీరనుంది. ఇందులో ఎంతమంది కొత్త క్యాబినెట్ లో ఉంటారు. ఎంత మంది కొత్త వారు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంచితే మంత్రి మండలి సమావేశ సమయంలో ఓ విచిత్ర ఘటన జరిగినట్లు సమాచారం.
మంత్రులు రాజీనామా చేయడానికి వెళ్తున్న సందర్భంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా రాజీనామా చేయడానికి వెళ్లినట్లు సమాచారం. ఇంతలో అక్కడే ఉన్న వాచ్ మన్ .. మీరు క్యాబినెట్ మంత్రి కాదు సార్.. అని తెలియజేయండంతో రాంబాబు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. అంబటి రాంబాబు .. తనని తాను మంత్రిగా ఉహిచుకున్నాడేమో అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాంబాబు పొరపాటున అలా వెళ్లి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Breaking News : #AmbatiRambabu went to resign his ministry but refrain from himself and came back after watchman informed him that he’s not cabinet minister.#AndhraPradesh #YSJagan
— TV69Telugu (@TV69telugu) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.