ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తాను పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినేట్ భేటి జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. ముందుగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ దిగ్విజయంగా పూర్తయిన సందర్బంగా సీఎం జగన్ ని మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రేవేశపెట్టారు. ఈ సందర్బంగా నిరుద్యోగులకు జగన్ సర్కార్ ఓ శుభవార్త తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇండస్ట్రీయల్ పాలసీ 2023-27 కు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి సీఎం జగన్.. కేబినెట్ లో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ కూడా తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు 6 వేల రూపాయల జీతంతో ఏపీ వ్యాప్తంగా 5388 మంది నైట్ వాచ్ మెన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయ బద్ధంగా కల్పించాల్సిన బిల్లులకు సైతం మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.
ఇదే సందర్భంగా అమలాపురం అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పలు గ్రంథాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కి పదవీ విరమణ వయసు 62 కు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వచ్చే నెల పెన్షన్ ను ఏప్రిల్ 3 వ తేదీన పంపినీ చేయనున్నట్లు మంత్రి వర్గం తెలిపింది. ఏప్రీల్ 1 న ఆర్బీయ్ కి సెలవు.. ఆ తర్వాత 2వ రోజు ఆదివారం కావడంతో 3వ తేదీన కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.