ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. డీఎల్ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. ఇక ఇంటర్వ్యూలో డీఎల్ మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపు వీరిద్దరి హత్య జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. అంతేకాక గత ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే కడపలో వివేకానందరెడ్డి హత్య, విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి డ్రామా జరిగాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు. గతంలో కోడికత్తి డ్రామా, వివేకా హత్య కేసులను వాడుకుని.. జనాల్లో సింపతీ సాధించి.. అధికారంలోకి వచ్చాడు. ఈ సారి విజయం సాధించడం కోసం జగన్.. ఎవరి గొంతు కోయాలా అనే ఆలోచన చేస్తు ఉండి ఉంటాడనే అనుమానం ఉందంటూ డీఎల్ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రశాంత్ కిశోర్ గతంలో ఇచ్చిన ఆలోచనలు వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎవరినైనా చంపి సింపతీ మీద గెలవాలని ప్రయత్నించొచ్చని డీఎల్ చెప్పుకొచ్చారు. గతంలో కోడికత్తి, వివేకా హత్య కేసుల వల్లే జగన్ అధికారంలోకి వచ్చాడని డీఎల్ ఆరోపించాడు. డీఎల్ వ్యాఖ్యల పై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. మరి డీఎల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.