కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి కావాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అందులో భాగంగానే భారత్ జోడోయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా రాహుల్ గాంధీ టీం చేసిన కొన్ని పనులు.. ఆయన్ని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది. ఈ విషయం కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కేజీఎఫ్ 2 సినిమాలోని పాటలని.. రాహుల్ ప్రచారానికి ఉపయోగించారు. దీంతో సదరు పాటల హక్కుల్ని కొనుగోలు చేసిన ఎమ్ఆర్ టీ మ్యూజిక్ కంపెనీ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాపీరైట్ ఉల్లంఘనగా దీన్ని పరిగణిస్తూ.. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనటేపై బెంగళూరు సిటీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ చట్టబద్ధమైన హక్కుల మేరకే కాంగ్రెస్ పార్టీపై కేసు పెట్టామని, ఏ రాజకీయ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని పేర్కొన్నారు.
తమ కంపెనీ దగ్గర 20 వేలకు పైగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పాటల మ్యూజిక్ హక్కులు ఉన్నాయని ఎమ్ఆర్ టీ మ్యూజిక్ సంస్థ పేర్కొంది. ఈ రైట్స్ కోసం బోలెడంత డబ్బు పెట్టుబడిగా పెట్టామని, అయితే కాంగ్రెస్ పార్టీ.. తమ సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు, లైసెన్స్ తీసుకోకుండానే కేజీఎఫ్ 2 సాంగ్స్ ఉపయోగించిందని ఎమ్ఆర్ టీ సంస్థ తెలిపింది. రాహుల్ జోడో యాత్రలో తమ పాటల్ని ఉపయోగించారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఇదంతా జరిగింది కాబట్టే యశ్వంత్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు IPC, ఇన్మర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000తో పాటు కాపీరైట్ చట్టం 1957 కింద కేసు నమోదు చేశారని ఎమ్ఆర్ టీ మ్యూజిక్ సంస్థ వెల్లడించింది.
#Breaking: FIR filed against #RahulGandhi & 2 other #Congress leaders in #Bengaluru for violating Copyright Act.
MRT Music alleged 👇that its #KGF2 #music was illegally used in #BharatJodoYatra videos.@Jairam_Ramesh @PriyankKharge @TOIBengaluru @INCKarnataka @INCIndia pic.twitter.com/LzsNXKEQgt
— Rakesh Prakash (@rakeshprakash1) November 4, 2022
MRT Music ( #KGF2) files Copy Right Case against videos posted by the Indian National Congress featuring Mr. Rahul Gandhi, for using content without seeking permission/license for marketing and publicity. #MRTMusic #CopyRights pic.twitter.com/YlgFlPf8db
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 4, 2022
MRT Music, one of the leading record labels from the South (KGF Chapter 2) files a case against Indian National Congress for copyright infringement…#KGF2 #Congress #RahulGandhi #BharatJodaYatra pic.twitter.com/5uvHtfKEpW
— Mukesh Kumar (@mukeshjourno) November 4, 2022