ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటతెస్తుంటాయి.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. సీజనల్ వ్యాధులతో సినీ సెలబ్రెటీలు కూడా బాధపడుతుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ ఆరంభించి.. బుల్లితెరపై సందడి చేసిన చాలా మంది నటీమణులు తర్వాత వెండితెరపై ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అలాంటివారిలో మౌనీ రాయ్ ఒకరు. ‘నాగిని’ సినియల్ తో అన్ని బాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న మౌనీ రాయ్ తర్వాత వెండితెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల రిలీజ్ అయిన ‘బ్రహ్మస్త్ర’ మూవీలో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ మూవీలో ఐటెం సాంగ్ లో తన అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. తాజాగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..
పశ్చమ బెంగాల్ టివీ, సినీ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో నాగిని సీరియల్ లో నటించిన మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఇండస్ట్ీరలోకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది. ఇటీవల బ్రహ్మస్త్ర మూవీలో నెగిటీవ్ పాత్రల్లో కనిపించింది. యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 లో ఐటమ్ సాంగ్ లో నటించింది. తాజాగా మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హెల్త్ కండీషన్ గురించి సంచలన విషయాలు అభిమానులకు షేర్ చేసింది. ‘నేను అనారోగ్యంతో 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.. ఆ సమయంలో చాలా లోతైన నిశ్చలతతో నేను మునిగిపోయాను. ఆస్పత్రిలో చాలా బాధను అనుభవించాను.. ప్రస్తుతం అనారోగ్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను, ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చాను, ఇన్ని రోజులు నా కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన హాస్పిటల్ సిబ్బందికి నా కృతజ్ఞతలు, నేను ఇంతకుముందు కన్నా చాలా బాగున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను’అంటూ పోస్ట్ చేసింది.
ఆసుపత్రిలో ఉన్న సమయంలో నా భర్త నంబియార్ నాకు ఎంతో తోడుగా నిలిచారు.. ధైర్యం చెప్పారు. నా జీవితం అంతా ఆయనకు రుణపడి ఉంటానని చెప్పింది. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపిన స్నేహితులు, అభిమానులు ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేసింది. అయితే మౌనీ రాయ్ హాస్పిట్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు మౌనీ రాయ్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. కొంతకాలంగా తన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది మౌనీ రాయ్. గతంలో కూడా ఆమె తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అగా మారాయి.