ఏపీలో నిత్యం అధికార, ప్రతిపక్షాల మధ్యం రాజకీయ రగడ కొనసాతూనే ఉంటుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విరుచకపడుతుంటారు. తాజాగా గుడివాడలో జరిగిన క్యాసినో నిర్వహణపై గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి:
మహిళని వివస్త్రని చేసి కొట్టిన ఫారెస్ట్ అధికారులు! మంత్రి సీరియస్!
గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెషన్ సెంటర్ లో సంక్రాంతి సందర్భంగా క్వాసినో నిర్వహించినట్లు ఆరోపణలోచ్చాయి. దీనిపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ గుడివాడలోని కె-కన్వేషన్ సెంటర్ ను పరిశీలించడానికి వెళ్లడంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. దీనిపై కొడాలి నాని కూడా స్పందించారు. తాను క్యాసినో, పేకాట నిర్వహించానని నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని సవాలు విసిరారు. ఇక మంత్రి కొడాలి నాని సవాల్ కి కౌంటర్ గా బొండా ఉమ మీడియా ముందు ప్రతి సవాల్ విసిరారు.
“ఏ తప్పు చేయకుంటే నిజ నిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు? కొడాలి నాని దొరికిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రి గారి సవాల్ ను స్వీకరిస్తున్నాం. క్యాసినో జరిగిందని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు రావాలో మీరే చెప్పండి. అప్పుడు చెరో డబ్బా పెట్రోల్ తెచ్చుకుందాం. తేల్చుకుందాం. క్యాసినోలో డ్యాన్స్ లు వేసిన వారి పేర్లు మా వద్ద ఉన్నాయి. కరోనా వచ్చిందని హైదరాబాద్ లో ఉంటే చేసిన తప్పులు పోతాయా? దీనిపై చర్చకు మా తరపున నేను ఒక్కడినే వస్తాను. క్యాసినో జరగలేదని తేలితే పెట్రోల్ పోసుకునేందుకు నేను సిద్ధం. జరిగిందని రుజువైతే ఆత్మహత్య అవసరం లేదు, మంత్రి పదవికి రాజీనామా చేయి చాలు” అంటూ బొండా ఉమ కొడాలి నానికి సవాల్ విసిరారు. ఇక క్యాసినోకి సంబంధించిన వీడియోలను ఉమ మీడియాకు విడుదల చేశారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.