ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ వెనుక వెళ్తున్న ఎమ్మెల్యేల కార్ల ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేల కార్లుకు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో వాహనాల్లో ఎమ్మెల్యేలు లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వరుసలో వెళ్తున్న ఎమ్మెల్యేల కార్లు ఒక దాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తమ నేతలు లేకపోవడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు పర్యటనలో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ లో ఈ అపశృతి చోటుచేసుకుంది. కాన్వాయ్ వెనుక వెళ్తున్న ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి , ప్రసన్నకుమార్ రెడ్డి , కాకాని గోవర్ధన్ రెడ్డి కారులు ప్రమాదానికి గురయ్యాయి. ప్రసన్న కుమార్ రెడ్డి కాన్వాయ్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆయన కారు వెనుకనే ఉన్న ఆనం కారు ఢీ కొట్టింది. ఆనం రామనారాయణ రెడ్డి కారును కాకాని గోవర్ధన్ రెడ్డి కారు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో వాహనాల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు.