ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఓ వైపు ఒడిసాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 278కి చేరింది. దాదాపు 1000 మంది దాకా గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టాలపై ఈ భారీ విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఓ వైపు ఒడిసాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
నాగర్ కోయిల్-ముంబై రైలు వచ్చే సమయంలో గేట్ దగ్గర ఉన్న గేట్ మేన్ గేట్ వేయాల్సి ఉంది. కానీ అతడు గేట్ వెయ్యలేదు. అదే సమయంలో వాహానాలు రైల్వే ట్రాక్ ను అటూ ఇటూదాటుతూ ఉన్నాయి. అంతలోనే ట్రైన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే రైలు లోకో పైలట్.. దూరం నుంచి వాహనాలు రాకపోకల్ని చూసి సడెన్ గా బ్రేక్ వేశాడు. దాంతో రైలు గేట్ రాకముందే రైలు అక్కడిక్కడే ఆగిపోయింది. దాంతో వాహానదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరిపారు. లోకోపైలెట్ రైలును ఆపకపోయి ఉంటే.. మరో ఘోర ప్రమాదం జరిగి ఉండేది. అని అక్కడ ఉన్న అధికారులు అంటున్నారు.