తెలంగాణ జనగామ జిల్లా సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి మహిళా కానిస్టేబుల్ జారి రోడ్డుపై పడ్డారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభానికి ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లారు. ఉదయం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించి.. హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన కేసీఆర్.. జనగామ జిల్లా, […]
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఎంత బందోబస్తు ఉంటుందో అందరికి తెలిసిందే. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసుల భద్రతను సైతం దాటి సీఎం వాహన శ్రేణిపై దాడులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కోసం కారు కావాలంటూ.. తిరుమల దర్శనానికి బయలుదేరిన వారిని.. ఒంగోలులో ఓ కానిస్టేబుల్ అడ్డుకుని.. వారి కారుని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సంఘటనపై సీఎం జగన్ స్పందించారు. తిరుమల వెళ్లే వారి వాహనాన్ని లాక్కోవడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. […]
నాయకుడు పర్యటన నిమిత్తం బయటకు వెళ్లాడంటే.. ఆయన వెంట మంది మార్బాలం, పదుల కొద్ది వాహనాలు బయలుదేరాల్సిందే. ఇక ఈ వీఐపీల కాన్వాయ్‌లు వెళ్తుంటే.. జనాలను రోడ్డు మీద ఆపేస్తారు. దీనిపై సమాజంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌లను కూడా ఆపేస్తారు. ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం కొందరు నాయకులకు ఇష్టం ఉండదు. ఈ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన పర్యటన సందర్భంలో సామాన్య ప్రజలకు, అత్యవసర సేవలకు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ వెనుక వెళ్తున్న ఎమ్మెల్యేల కార్ల ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేల కార్లుకు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో వాహనాల్లో ఎమ్మెల్యేలు లేనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వరుసలో వెళ్తున్న ఎమ్మెల్యేల కార్లు ఒక దాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తమ నేతలు లేకపోవడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు పర్యటనలో ఉన్న సీఎం జగన్ […]
ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక మార్గంలో వస్తుందంటే చాలు ఎక్కడ లేని హడావిడి మొదలైపోతుంది. ఆ రోడ్డంతా ఖాళీగా ఉంటుంది. ఒక పురుగు కూడా ఆ మార్గంలో వెళ్లడానికి వీలుండదు. పైగా కాన్వాయ్ మామూలుగా ఉండదూ ఎర్ర బుగ్గల బండ్లు కూయ్.. కూయ్.. మంటూ ఒక దాని వెంట ఒకటి దూసుకెళ్తాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో వెళ్తేంటే కనిపించే దృశ్యాలు ఇవి. కానీ తమిళనాడులో మాత్రం ఇందుకు భిన్నంగా ఒక అంబులెన్స్‌కు ఏకంగా సీఎం కాన్మాయ్ […]