ఈ వీకెండ్ సినిమాల జాతర ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు 19 సినిమాలు/వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి చూసేద్దామా?
ఈ వీకెండ్ మీరు సినిమాలతో పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 20 వరకు కొత్తవి రిలీజ్ అవుతున్నాయి మరి. సాధారణంగా ప్రతివారం ప్రారంభంలో కొత్త మూవీస్ లిస్ట్ వచ్చేస్తుంది. ఏమేం రిలీజ్ అవుతున్నాయి? ఎందులో రిలీజ్ అవుతున్నాయనేది మనకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అలా వీకెండ్ వచ్చేలోపు కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తాయి. మరికొన్ని మాత్రం సరిగ్గా శుక్రవారం రిలీజ్ అవుతాయి. అలా దాదాపు వీకెండ్ అంతా కూడా సోషల్ మీడియాలో వాటి గురించే మాట్లాడుకుంటారు. అవి ఎలా ఉన్నాయి? ఏంటనే టాక్ మాత్రమే నడుస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే ఈ వారం కూడా చాలానే సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అందులో బాగా ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ మాత్రం బాలయ్య ‘వీరసింహారెడ్డి’. థియేటర్లలో మాస్ జాతర క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఓటీటీలో ఎన్ని వండర్స్ సృష్టిస్తుందో చూడాలి. దీనితో పాటే మైఖేల్ మూవీ, పులి మేక వెబ్ సిరీస్, నాన్ పాకల్ నేరతు మయక్కమ్, క్రాంతి లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వీటితో పాటే కొన్ని వెబ్ సిరీసులు కూడా చూడాలనే ఆత్రుతని కలిగిస్తున్నాయి. మరి ఈ వీకెంట్ ఏయే సినిమాలు/ వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయనేది చూద్దాం.