ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా బోలెడన్ని సినిమాలు వచ్చేశాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?
మార్చి అనగానే చాలామందికి స్కూల్ లో ఫైనల్ ఎగ్జామ్సే గుర్తొస్తాయి. ఈ హడావుడి ఉంటుంది కాబట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా రిలీజ్ కావు. చిన్న చిత్రాలు ఎక్కువగా థియేటర్లలోకి వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఓటీటీలకు కూడా బాగానే తగిలినట్లు కనిపించింది. ఎందుకంటే ఈ వారం ప్రారంభంలో పెద్దగా మూవీస్ విడుదలకు రెడీ కాలేదు. అయితే వీకెండ్ వచ్చేసరికి మాత్రం పలు చిత్రాలని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల మధ్య తేడా చెరిగిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేదు. బాగుందని మౌత్ టాక్ వస్తే చాలు ఆ మూవీని ఎగబడి చూసేస్తున్నారు. అలా ఈ వారం కూడా చాలావరకు చిన్న సినిమాలే ఓటీటీల్లో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమ్ అవుతుండగా, మరికొన్ని శుక్రవారం, శనివారం రిలీజ్ కానున్నాయి. ఈ జాబితాలో ‘బుట్టబొమ్మ’ లాంటి క్యూట్ సినిమాతో పాటు ‘ద గ్రేట్ ఇండియా’, ‘అలోన్’ లాంటి డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. ‘తెలుగు ఇండియన్ ఐడల్’ రెండో సీజన్ కూడా ఈ వీకెండ్ నుంచే ప్రారంభం కానుంది.
సోనీ లివ్: