టాలీవుడ్ అభిమానులు.. తెలుగు పరిశ్రమలోని వారినే కాకుండా ఇతర చలన చిత్ర రంగానికి చెందిన నటీనటులను ఆదరిస్తుంటారు, అభిమానిస్తుంటారు. నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చి ఫేమ్ అయిన వారున్నారు
టాలీవుడ్ అభిమానులు.. తెలుగు పరిశ్రమలోని వారినే కాకుండా ఇతర చలన చిత్ర రంగానికి చెందిన నటీనటులను ఆదరిస్తుంటారు, అభిమానిస్తుంటారు. నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా.. డబ్బింగ్ సినిమాల ద్వారా వచ్చి ఫేమ్ అయిన వారున్నారు. తొలుత బాలీవుడ్ నటుల్ని విపరీతంగా అభిమానించిన తెలుగు పరిశ్రమ.. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ హీరోలకు బ్రహ్మరథం పట్టారు. విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి వారికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది టాలీవుడ్‌లో. ఇక్కడ ప్రత్యేక మార్కెట్ ఉంది. అందుకే ఇప్పుడు తెలుగులో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు కోలీవుడ్ టాప్ హీరోస్. అయితే వీరిలో దళపతి స్టైలే వేరు.
తెలుగులో పవన్ కళ్యాణ్ పేరు చెబితే పూనకాలు వస్తాయో.. తమిళంలో విజయ్ అలాగా. అతడి సినిమా కోసం పిచ్చిగా ఎదురు చూస్తుంటారు తమిళ తంబీలు. థియేటర్ల విషయంలో తమ హీరోకు అన్యాయం జరిగిందంటూ ఓ స్క్రీన్ తగుల బెట్టేసేంత అభిమానం వారిలో. అందుకే వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విజయ్. ఈ సంక్రాంతికి వారసుడు బైలింగ్వల్ సినిమా ద్వారా (దర్శక,నిర్మాతలు టాలీవుడ్ వాళ్లే) తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇటీవల విజయ్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ పెను సంచలన దర్శకుడు లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో లియోలో మేం రెడీ అంటూ ఓ పాటను విడుదల చేశారు.
అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులే కాకుండా సినీ, రాజకీయ పరిశ్రమకు చెందిన అనేక మంది అతడికి విషెస్ తెలిపారు. వీరిలో నటి పూజా హెగ్డే కూడా ఉన్నారు. అయితే ఆమె ఓ వీడియో పెట్టారు. అందులో అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ పాట బుట్ట బొమ్మ సాంగ్ కు స్టెప్స్ వేశారు విజయ్. బీస్ట్ సినిమా సందర్భంగా ఇద్దరు చిన్నారులు వీరిద్దరూ కలిసి ఈ సాంగ్‌కు కాళ్లు కదిపారు. అందులో విజయ్ బుట్ట బొమ్మ స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. బన్నీ పాటకు విజయ్ డ్యాన్స్ వేసిన ఈ వీడియో ఇరువురు ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ నటిస్తున్న లియో మూవీ అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్రిష కథానాయిక.