ఓటీటీలోనూ ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో బాలయ్య, విజయ్ సినిమాలతో పాటు ఓ తెలుగు వెబ్ సిరీస్ కూడా ఉంది.
ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్ హీరోల వెబ్ సిరీసుల వరకు ఉన్నాయి. గత రెండు మూడేళ్ల నుంచి ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఏదైనా కొత్త మూవీ రావడం లేటు. ఎలా ఉంది.. ఎందులో ఉంది అనే టాక్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అలా ఈ వారం కూడా ఏకంగా 18 సినిమాలు/వెబ్ సిరీసుల వరకు రెడీ అయిపోయాయి. ఇంతకీ ఈ లిస్టులో ఏయే చిత్రాలున్నాయి. అవి ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి వారం థియేటర్లలో ఓ నాలుగైదు సినిమాలు మహా అయితే రిలీజ్ అవుతుంటాయి. అదే ఓటీటీలో తీసుకుంటే.. 15-20కి పైగానే ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. అందుబాటులో ప్రముఖ ఓటీటీ యాప్స్ తోపాటు కొన్ని లోకల్ యాప్స్ లోనూ ఈ సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంటాయి. అలా ఈ వారం బాలయ్య ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’, సందీప్ కిషన్ ‘మైఖేల్’ ఓటీటీలోకి రానున్నాయి. వీటితో పాటు ఈ వారం ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్ కూడా జీ5లో రిలీజ్ కానుంది. మరి ఓటీటీలో విడుదలయ్యే సినిమాల పూర్తి జాబితా ఏంటో చూసేద్దామా?