కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ పార్టీ మూడ్ నుంచి బయటకొచ్చేసి ఉద్యోగులు ఆఫీసులకి, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లిపోతున్నారు. మళ్లీ యధావిధిగా రొటీన్ లైఫ్ స్టార్టయిపోయింది. ఏడాది మారొచ్చు, డేట్ మారొచ్చు కానీ ప్రతి వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అలానే జనవరి తొలి వారంలో ఏకంగా 18 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సిరీస్ లు ఉన్నాయి. కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ అవేంటి? వాటి లిస్టు ఏంటనేది ఓసారి చూసేద్దాం.
ఇక విషయానికొస్తే.. న్యూయర్ రాగానే తెలుగు ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతికి ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? వాటిలో దేనికి వెళ్లాలి అనే మైండ్ సెట్ తోనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఈసారి కూడా చిరు, బాలయ్య, విజయ్, అజిత్ లాంటి బడా హీరోస్.. భారీ బడ్జెట్ మూవీలతో థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. దీనికి ఇంకా రెండు వారాల టైం ఉంది. అంతలో కొత్త సినిమాలు చూడాలి కాబట్టి.. ఈ వారం కూడా అన్ని ఓటీటీల్లో కలిపి 18 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని ఈ వీకెండ్ లోపు విడుదలైపోతాయి. వాటిలో తెలుగు సినిమాలయితే పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు.