థియేటర్ లో విడుదలైన కొత్త సినిమాని రూ. 99కే ఇంటిల్లిపాది చూడచ్చు. అదెలాగో స్టెప్ బై స్టెప్ మీరే తెలుసుకోండి.
థియేటర్ లో విడుదలైన కొత్త సినిమాని రిలీజ్ రోజునే చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే నలుగురు సభ్యులున్న కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలంటే కనీసం రూ. 1000 ఖర్చు అవుతాయి. మల్టీప్లెక్స్ కి వెళ్తే రూ. 1500 నుంచి రూ. 2 వేలు ఎగిరిపోతాయి. టికెట్స్ కాకుండా అదనంగా అక్కడ జేబులకు చిల్లు పెట్టేలా పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధరలు ఉంటాయి. ఒక సగటు ప్రేక్షకుడు సినిమాకి వెళ్లాలంటే.. ఏంటి ఒక సినిమాకి వెళ్లాలంటే రూ. 3 వేలు వదిలించుకోవాల్సి వస్తుంది. అయితే కేవలం రూ. 99కే ఇంటిల్లిపాది కలిసి థియేటర్ లో విడుదలైన సినిమాని చూసే అవకాశం ఏపీఎస్ఎఫ్ఎల్ కల్పిస్తుంది. రూ. 99తో సబ్ స్క్రైబ్ చేసుకుంటే చాలు విడుదల రోజు నాడే కొత్త సినిమాని ఇంట్లో కూర్చుని వీక్షించవచ్చు.
ఇటు ప్రేక్షకుడికి, అటు నిర్మాతకి ఇద్దరికీ లాభం చేకూరేలా ఈ సరికొత్త అవకాశాన్ని కల్పిస్తుంది ఏపీ ఫైబర్ నెట్. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే పద్ధతిలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జూన్ 2న విశాఖపట్నంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్ లో స్ట్రీమింగ్ ఉంటుంది. రూ. 99తో సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి 24 గంటల పాటు సినిమా అనేది అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి పట్టణాల్లో థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సినిమా చూడాలంటే మాధ్యమం ఏంటి? ఎక్కడ చూడాలి? ఎలా చూడాలి?
థియేటర్ లో విడుదలైన రోజున ఇంట్లో కూర్చుని సినిమా చూడాలంటే ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు అయి ఉండాలి. ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు అవ్వాలంటే ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమీపంలో ఉన్న ఏజెంట్ ద్వారా గానీ లేదా ఆన్ లైన్ లో అప్లై చేయడం ద్వారా గానీ కనెక్షన్ ని తీసుకోవచ్చు. ఇంటర్నెట్ డేటాతో పాటు టీవీ ఛానల్స్ చూసే అవకాశం కల్పించేదే ఏపీ ఫైబర్ నెట్. ఇందులో మరొక సదుపాయం కూడా ఉంది. ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సదుపాయం ఉంది. ఐపీటీవీ సర్వీస్ ద్వారా టెలివిజన్ కార్యక్రమాలు, ఇతర వీడియో కంటెంట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఏపీ ఫైబర్ నెట్ లో రెండు రకాల సర్వీసులు ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్, రెండు ఎంటర్ప్రైజ్. సామాన్యుడు ఇంట్లో కూర్చుని సినిమా చూడడమే కాన్సెప్ట్ కాబట్టి డొమెస్టిక్ సర్వీసుల గురించి తెలుసుకుందాం. ఇందులో ట్రిపుల్ ప్లే సర్వీస్ అని ఒకటి ఉంది. ఇంటర్నెట్, టెలిఫోన్, ఐపీటీవీ మూడు రకాల సేవలు కలిపి ఒకే సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నెట్ వాడుకోవచ్చు, ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు. అయితే నెలకు కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ అల్ట్రా, హోమ్ పై, హోమ్ లైఫ్, ఓటీటీ మినీ, ఓటీటీ మ్యాక్సీ, ఓటీటీ ప్రైమ్, హోమ్ గోల్డ్, హోమ్ గోల్డ్ ప్లస్, హోమ్ ప్లాటినం, హోమ్ బేసిక్, హోమ్ ఎసెన్షియల్, హోమ్ ప్రీమియం, ఎంటర్ప్రైజ్ బేసిక్, ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్ ప్రీమియం వంటి ప్లాన్స్ ఉన్నాయి.
హోమ్ ఎసెన్షియల్ ప్లాన్ ని రూ. 449తో సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుగు ఛానల్స్, స్పోర్ట్ ఛానల్స్ చూడచ్చు. అలానే 300 జీబీ ఇంటర్నెట్ డేటా, ఏ నెట్వర్క్ కైనా అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం పొందవచ్చు. ఈ ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 జీబీ ఎఫ్యూపీ లిమిట్, ఎఫ్యూపీ తర్వాత 2 ఎంబీపీఎస్ స్పీడ్, 240+ టీవీ ఛానల్స్, అపరిమిత లోకల్ కాల్స్ ఉంటాయి. 18% జీఎస్టీతో కలిపే ఈ ప్లాన్ వస్తుంది. థియేటర్ లో విడుదలైన రోజున కొత్త సినిమా చూడాలంటే మీకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. ఇది తీసుకుంటే మీకు ఇంటర్నెట్ డేటాతో పాటు టీవీ ఛానల్స్ వస్తాయి, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా రూ. 99 చెల్లిస్తే కొత్త సినిమాని విడుదలైన రోజునే ఇంటిల్లిపాది చూడచ్చు.